ఏబీఎన్‌ రాధాకృష్ణ తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఏబీఎన్‌ రాధాకృష్ణ తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలి

Oct 29 2026 1:30 AM | Updated on Oct 29 2026 1:30 AM

మహిళల గౌరవాన్ని కించపరిస్తే

ఊరుకోం!

ఏబీఎన్‌ కార్యాలయాల వద్దకు

వెళ్లేందుకూ వెనుకాడబోం

మీడియాతో వైఎస్సార్‌సీపీ అధికార

ప్రతినిధి మంచా నాగమల్లేశ్వరి

మహారాణిపేట: ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తప్పుడు కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి మంచా నాగమల్లేశ్వరి విమర్శించారు. మహిళల విషయంలో రాధాకృష్ణ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. బుధవారం మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మేనకోడలి వివాహాన్ని సైతం రాజకీయాలకు ఉపయోగించుకోవడం దురదృష్టకరమన్నారు. వైఎస్‌ భారతి పేరుతో తప్పుడు లేఖను సృష్టించి, ఆమె రాయకుండానే రాసినట్లు ప్రచారం చేయడాన్ని తప్పుబట్టారు. ఇలాంటి తప్పుడు కథనాలను రాస్తూ మహిళల గౌరవానికి భంగం కలిగిస్తే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. రాధాకృష్ణ తన తప్పుడు ప్రచారానికి క్షమాపణ చెప్పే రోజు దగ్గరలోనే ఉందని స్పష్టం చేశారు. మహిళల ఆత్మగౌరవం కోసం అవసరమైతే ఏబీఎన్‌ కార్యాలయాల వద్దకు వెళ్లేందుకు కూడా మహిళా లోకం వెనుకాడబోదని తేల్చి చెప్పారు. మహిళల సంక్షేమం కోసం గొప్పలు చెప్పుకునే నారా లోకేష్‌, మహిళలపై జరుగుతున్న ఈ తరహా ప్రచారంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. లోకేష్‌ ఇంట్లోని మహిళలే మహిళలా? మిగతా మహిళల గౌరవానికి విలువ లేదా? అని నిలదీశారు. మహిళల గౌరవాన్ని కించపరిచే తప్పుడు ప్రచారాలను తక్షణమే నిలిపివేయాలని, సంబంధిత కథనాలపై బాధ్యత వహించి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement