లంచాల కోసం రోగుల్ని వేధిస్తున్న వార్డు బాయ్‌ | - | Sakshi
Sakshi News home page

లంచాల కోసం రోగుల్ని వేధిస్తున్న వార్డు బాయ్‌

Oct 29 2026 1:30 AM | Updated on Oct 29 2026 1:30 AM

ఎక్స్‌రేకు తీసుకెళ్లేందుకు రూ.2 వేలు

డిమాండ్‌ చేసినట్లు బంధువుల ఆరోపణ

మహారాణిపేట: పేదలకు ఉచిత వైద్యం అందించాల్సిన కేజీహెచ్‌లో ఓ వార్డు బాయ్‌ లంచం కోసం రోగి బంధువులను వేధించిన ఘటనపై ఓ వీడియో బుధవారం హల్‌చల్‌ చేసింది. దీంతోపాటు చికిత్స పొందుతున్న రోగిని ఎక్స్‌రే పరీక్షకు తీసుకెళ్లేందుకు డబ్బులు డిమాండ్‌ చేయడంపై సదరు కుటుంబ సభ్యులు కూడా మీడియాకు వివరాలు వెల్లడించారు. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. కేజీహెచ్‌లోని భావనగర్‌ వార్డులోని ఏఎంసీ యూనిట్‌లో ఆయాసంతో బాధపడుతున్న ఓ రోగి చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఎక్స్‌రే పరీక్ష చేయాలని సూచించడంతో, రోగిని పరీక్షల కోసం తీసుకెళ్లాలని వార్డు స్టాఫ్‌ నర్సు, ఇతర సిబ్బంది వార్డు బాయ్‌కు చెప్పారు. అయితే, రోగిని ఎక్స్‌రేకు తీసుకెళ్లేందుకు రూ.2 వేలు ఇవ్వాలని వార్డు బాయ్‌ డిమాండ్‌ చేసినట్లు రోగి బంధువు రామకృష్ణ ఆరోపించారు. డబ్బులివ్వకపోతే రోగిని తీసుకెళ్లనని వార్డు బాయ్‌ స్పష్టం చేసినట్లు ఆయన వాపోయారు. కలెక్టర్‌కు, ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పినా, తన డబ్బులు ఇవ్వాల్సిందేనని వార్డు బాయ్‌ పట్టుబట్టినట్లు పేర్కొన్నారు. చివరకు డబ్బులు ఇచ్చిన తర్వాతే రోగిని ఎక్స్‌రే పరీక్షకు తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని భావించినా, తమకు ఫిర్యాదు చేస్తే రోగికి చికిత్సలో ఇబ్బందులు ఎదురవుతాయేమోనన్న ఆందోళనతో వెనుకడుగు వేసినట్లు బంధువులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement