వరుదు కల్యాణికి నీరాజనం | - | Sakshi
Sakshi News home page

వరుదు కల్యాణికి నీరాజనం

Oct 25 2026 1:17 AM | Updated on Oct 25 2026 1:17 AM

రైతు కన్నీటికి కూటమి పాలనే కారణం

సాక్షి, విశాఖపట్నం: పంట పండించేందుకు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన రైతులకు కనీసం ఖర్చులు కూడా తిరిగి రావడం లేదని, దళారుల దోపిడీకి తోడు ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారిందని వైఎస్సార్‌సీపీ విశాఖ మేయర్‌ అభ్యర్థి వరుదు కల్యాణి విమర్శించారు. రైతుల కష్టాలు తీర్చలేని కూటమి పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సీతమ్మధార, కంచరపాలెం రైతు బజార్లను సందర్శించిన ఆమె.. జిల్లా అధ్యక్షుడు కేకే రాజుతో కలిసి రైతులు, కూలీలు, చిరు వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ జీవీఎంసీ మేయర్‌ అభ్యర్థి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఎన్నికల ప్రచారంతో గాజువాక సందడిగా మారింది. శనివారం ఉదయం 94వ వార్డు గంగవరంలో ప్రారంభమైన ప్రచారం 94, 92, 91, 88, 89, 86, 90, 100, 101, 102 వార్డుల మీదుగా సాగింది. సుమారు 20 కిలోమీటర్ల మేర సాగిన ప్రచారంలో పార్టీ శ్రేణులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పలుచోట్ల మహిళలు పూలు చల్లుతూ, మంగళహారతులతో వరుదు కల్యాణికి స్వాగతం పలికారు. యువత బైక్‌ ర్యాలీలు నిర్వహించగా, మహిళలు పాదయాత్రగా ప్రచారంలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, గాజువాక సమన్వయకర్త తిప్పల దేవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురుమూర్తిరెడ్డి, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, సినీనటుడు జోగినాయుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌, ఆయా వార్డుల కార్పొరేటర్‌ అభ్యర్థులు పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా వరుదు కల్యాణి కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. విశాఖ ప్రజలు చెల్లించిన పన్నుల్లో రూ.1,700 కోట్లను అమరావతికి తరలించారని ఆరోపించారు. జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని గెలిపిస్తే నగరంలో తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, పారిశుధ్య సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గాజువాకలో వాయు కాలుష్య నివారణకు చర్యలు చేపడతానని, ప్రతి వారం రెండు రోజులు వార్డుల్లో ప్రజా సమస్యలపై గ్రీవెన్స్‌ నిర్వహిస్తానని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement