ఎన్నికల నిబంధనలకు పాతర | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల నిబంధనలకు పాతర

Oct 25 2026 1:17 AM | Updated on Oct 25 2026 1:17 AM

సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ ఎన్నికల ప్రక్రియ వేడెక్కిన వేళ నిబంధనల ఉల్లంఘనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. 26వ వార్డు జనసేన అభ్యర్థి ముగడ వెంకట లక్ష్మి భర్త, పబ్లిక్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగి ముగడ సురేష్‌ ఎన్నికల నియమావళిని బహిరంగంగా అతిక్రమిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన 2019 నుంచి ప్రభుత్వ సర్వీసులో కొనసాగుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం చట్టరీత్యా నేరం. ఎన్నికల నిబంధనల ప్రకారం ఎలాంటి ప్రచారాల్లో కానీ, పార్టీ వ్యవహారాల్లో కానీ పాల్గొనకూడదు. అతిక్రమిస్తే శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకునే వీలుంది. అయితే ముగడ సురేష్‌ తన భార్య నామినేషన్‌ దాఖలు చేసిన సమయం నుంచి పార్టీ బీ–ఫారం స్వీకరించే వరకు, ప్రచార కార్యక్రమాల్లోనూ ఆమె వెంటే ఉంటూ కోడ్‌ను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. ఇంత బహిరంగంగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నా పబ్లిక్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు కానీ, జిల్లా ఎన్నికల అధికారులు కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి నిష్పక్షపాతంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

26వ వార్డులో ప్రచారంలో ప్రభుత్వ ఉద్యోగి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement