పెదగంట్యాడ: జనసేన కోసం కష్టపడిన వీర మహిళలకు స్థానిక ఎన్నికల్లో అవకాశం కల్పించకుండా స్థానిక పెద్దలు తమ కుటుంబ సభ్యులకు, డబ్బు, పరపతి ఉన్నవారికి టికెట్లు కేటాయించడం అన్యాయమని గాజువాక జనసేన వీర మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక అగ్నికుల క్షత్రియ కల్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గాజువాకలో బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ సరైన నాయకత్వం లేక పార్టీ వెనుకబడుతోందని విమర్శించారు. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడిన వీరమహిళలకు స్థానిక ఎన్నికల్లో ప్రాధాన్యం కల్పించకపోవడం బాధాకరమన్నారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ గుర్తించాలని, తమకు న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో రెయ్యి రత్నం, ఎం.షాలిని, లంకల మురళిదేవి, లంక లత, భూపతి జయలక్ష్మి, తోట ఇందిర, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


