మహారాణిపేట: జిల్లాలో మండల ప్రజా పరిషత్ పాలక వర్గాల గడువు బుధవారం ముగిసింది. జిల్లాలో మొత్తం 39 మండలాల్లో పాలక వర్గం స్థానంలో ప్రత్యేకాధికారుల పాలన గురువారం నుంచి మొదలుకానుంది. దీంతో విశాఖ జిల్లాలో ఉన్న నాలుగు మండలాలకు ప్రత్యేక అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ నియమించారు. ఆనందపురం మండలం ప్రత్యేక అధికారిగా వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి.విజయప్రసాద్, భీమిలిపట్నం ప్రత్యేక అధికారిగా డివిజనల్ డెవలప్‌మెంటు అధికారి బి.రమేష్‌నాయుడు, పద్మనాభం మండలానికి జంతు సంరక్షణ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వి.సునీల్, పెందుర్తి మండల ప్రత్యేక అధికారిగా డివిజనల్ డెవలప్‌మెంటు ఆఫీసర్ సి.ఉషారాణి నియమితులయ్యారు.


