ఏలేరు–కణితి ద్వారా తాగునీరు | - | Sakshi
Sakshi News home page

ఏలేరు–కణితి ద్వారా తాగునీరు

Sep 20 2026 1:33 AM | Updated on Sep 20 2026 1:33 AM

మహారాణిపేట: విశాఖ నగరానికి తాగునీటి కొరత రాకుండా ఏలేరు–కణితి వ్యవస్థ ద్వారా నీటిని అందిస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. శనివారం విశాఖలోని నార్త్‌ కోస్టు ఇరిగేషన్‌ సీఈ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కణితి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు ఏలేరు నుంచి రోజుకు 300 క్యూసెక్కుల నీరు అందుతోందన్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా ఏలేరులో నీటిని నిల్వ చేస్తున్నామని చెప్పారు. విశాఖకు ప్రధాన నీటి వనరులైన రైవాడ, మేఘాద్రిగెడ్డ, తాటిపూడి రిజర్వాయర్లలో ఉన్న నీటిని తాగునీటికి ప్రాధాన్యమిస్తూ సమర్థంగా వినియోగిస్తున్నట్లు తెలిపారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ నుంచి మేఘాద్రిగెడ్డకు 100 క్యూసెక్కుల నీరు అందించే పైప్‌లైన్‌ పనులు కొనసాగుతున్నాయని, 10.5 కిలోమీటర్లకు 9 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయని చెప్పారు. 2027లో పోలవరం పూర్తయిన వెంటనే ఎడమ ప్రధాన కాలువ ద్వారా 17,500 క్యూసెక్కుల సామర్థ్యంతో ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement