పేదల భూముల పరిరక్షణకు పోరాడుతాం | - | Sakshi
Sakshi News home page

పేదల భూముల పరిరక్షణకు పోరాడుతాం

Sep 20 2026 1:33 AM | Updated on Sep 20 2026 1:33 AM

మహారాణిపేట: దళితులు, బడుగు బలహీన వర్గాలు, రైతులకు సంబంధించిన భూముల పరిరక్షణ విషయంలో వైఎస్సార్‌సీపీ ప్రజల తరఫున నిరంతరం పోరాడుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మంచా నాగమల్లేశ్వరి స్పష్టం చేశారు. మద్దిలపాలెం కృష్ణా కాలేజ్‌ రోడ్డులోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. దశాబ్దాల క్రితం దళితులు, బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం కేటాయించిన భూములపై ప్రస్తుతం హక్కులు కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆరోపించారు. పేదలు, అణగారిన వర్గాలకు కేటాయించిన భూములను వారి నుంచి దూరం చేసే ప్రయత్నాలను తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. ‘పేదల భూములపై కన్నేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. భోగాపురం పరిసర ప్రాంతాల్లోని పలు సర్వే నంబర్ల భూములపై ప్రజల్లో ఆందోళనలు ఉన్నాయని ఆమె తెలిపారు. ముఖ్యంగా 17, 27, 30, 33, 59 తదితర సర్వే నంబర్ల భూముల విషయంలో వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. కొండపాలెం, బండిపాలెం ప్రాంతాలకు చెందిన 189, 191 తదితర సర్వే నంబర్ల భూముల వివరాలను కూడా ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు. గతంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దళితులు, బడుగు బలహీన వర్గాల హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యం ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం కూడా భూముల సమస్యలపై తమ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుందని స్పష్టం చేశారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మంచా నాగమల్లేశ్వరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement