విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రంలో ప్రవేశాలకు దరఖాస్తు గడువును అక్టోబర్ 13వ తేదీ వరకు పొడిగించినట్లు దూరవిద్య సంచాలకులు ఆచార్య డీఏ నాయుడు తెలిపారు. యూజీసీ–డీఈబీ సూచనలకు అనుగుణంగా ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ (ఓడీఎల్) ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ లెర్నింగ్ కోర్సులకు ఈ గడువు పొడిగించినట్లు పేర్కొన్నారు. జూలై–ఆగస్టు 2026 సెషన్‌కు సంబంధించి ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులు అక్టోబర్ 13లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓడీఎల్ (ఆఫ్‌లైన్) కోర్సుల ప్రవేశాలు, ఆన్‌లైన్ కోర్సుల వివరాల కోసం ఏయూ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని తెలిపారు.


