పైనాపిల్ కాలనీ జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో నాలుగు నెలలుగా తాగునీటి ఇబ్బందులు ఉన్నాయి. బోరు నుంచి నీరు రావడంలేదు. ట్యాంకర్ల ద్వారా రెండు, మూడు బిందెల నీరే దొరుకుతోంది.
– నసీమా బేగం, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం
కాలనీ, పైనాపిల్ కాలనీ
బోర్లు పనిచేయడం లేదు
స్వతంత్రనగర్ ఎన్టీఆర్ హుద్‌హుద్ కాలనీలో కుళాయిలు లేవు. ఉన్న బోర్లు కూడా పనిచేయడం లేదు. జీవీఎంసీ ట్యాంకర్లు వచ్చినా ఐదారు బిందెలకు మించి నీరు దొరకడం లేదు. పనులు మానుకుని ఎదురుచూడాల్సి వస్తోంది. తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం.
– సకల ప్రసాద్, మధురవాడ


