అక్కిరెడ్డిపాలెం: బీసీ రోడ్డులోని సంజీవనగర్ కాలనీలో కుళాయి నీటి కోసం వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి జారిపడి మృతి చెందాడు. గాజువాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళలోని కొల్లాం జిల్లాకు చెందిన తాడా విజయ్ (60) సంజీవనగర్ కాలనీలో ఎలక్ట్రిష న్‌గా పనిచేస్తూ కొంతకాలంగా ఒంటరిగా నివసిస్తున్నా డు. శుక్రవారం కు ళాయి నీటి కోసం కిందకు దిగి, నీటి బిందెతో తిరిగి పైకి ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి మెట్లపై నుంచి పడిపోయా డు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి బంధువు లు అందుబాటులో కి రాలేదని, వారి ఆచూకీ కోసం చర్యలు చేపడుతున్నామని పోలీసు లు తెలిపారు. బంధువులు వచ్చిన అనంతరం కేసు నమోదు చేసి దర్యా ప్తు కొనసాగిస్తామని వెల్లడించారు.


