బాబు! | - | Sakshi
Sakshi News home page

బాబు!

Sep 19 2026 8:50 AM | Updated on Sep 19 2026 8:50 AM

న్యూస్‌రీల్‌

విశాఖపట్నం
దాహం

మూడు రోజులకోసారి కుళాయి.. అదీ అరకొర నీరే

బోర్లు ఒట్టిపోయి.. ట్యాంకర్లు, వాటర్‌ క్యాన్లే దిక్కు

బిందెడు నీటి కోసం తెల్లవారుజాము నుంచే పడిగాపులు

ముడసర్లోవ, గంభీరం పరిస్థితి దారుణం.. రైవాడ, మేహాద్రిగెడ్డకూ ముప్పు

సీఎం పర్యటన వేళ శాశ్వత నీటి భద్రతపై నగరవాసుల ఆశలు

7

శనివారం శ్రీ 19 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

నేడు విశాఖకు

సీఎం చంద్రబాబు

మహారాణిపేట: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం విశాఖకు రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు విమానంలో నగరానికి చేరుకుంటారు. అనంతరం ఆర్కే బీచ్‌లో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య కార్మికులు, ప్రజలతో ముఖాముఖి మాట్లాడతారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కాలేజీ గ్రౌండ్‌కు చేరుకుని లబ్ధిదారులకు పట్టాల పంపిణీతో పాటు పలు మౌలిక సదుపాయాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3.50 గంటలకు విశాఖ నుంచి విమానంలో తిరుగుపయనమవుతారు.

నేడు ఇళ్ల పట్టాల పంపిణీ

జిల్లాలో ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న 25,880 మందికి సీఎం చంద్రబాబు ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ మైదానంలో పట్టాలు పంపిణీ చేయనున్నారు. విశాఖ రూరల్‌ మండలంలో అత్యధికంగా 8,074 మందికి, ములగాడ మండలంలో 4,213 మందికి, గాజువాకలో 3,999 మందికి, గోపాలపట్నంలో 2,956 మందికి, పెందుర్తిలో 2,736 కుటుంబాలకు, పెదగంట్యాడలో 1,694 మందికి, మహారాణిపేట మండలంలో 1,228 మందికి కన్వేయన్స్‌ డీడ్‌లు అందించనున్నారు.

తీర్చండి

అడుగంటుతున్న జలాశయాలు.. గొంతెండుతున్న నగరం

సాక్షి, విశాఖపట్నం : విశాఖ గొంతెండుతోంది. బిందెడు నీటి కోసం నగరవాసులు నానా అవస్థలు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే కుళాయిల వద్ద బిందెలతో పడిగాపులు కాస్తున్నా.. వచ్చే నీరు గంట కూడా ఉండటం లేదు. కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులకోసారి కుళాయి తిప్పుతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో అరకొర సరఫరాతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఇళ్లలోని బోర్లు ఒట్టిపోయాయి.. వీధి బోర్లు మూగబోయాయి. తాగడానికి, వంటకు, ఇతర నిత్యావసరాలకు నీరు లేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో వాటర్‌ క్యాన్లు, ప్రైవేట్‌ ట్యాంకర్లను ఆశ్రయిస్తూ జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. ఒకవైపు వర్షాభావంతో జలాశయాలు అడుగంటుతుండగా.. మరోవైపు కాంక్రీట్‌ నిర్మాణా లతో భూగర్భజలాలు కూడా పాతాళానికి పడిపోతున్నాయి. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సమస్య రోజురోజుకూ ముదురుతోంది. మూడు నెలలుగా కొన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతున్నా.. శాశ్వత పరిష్కారం కనిపించకపోవడంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం విశాఖ పర్యటనకు వస్తున్న వేళ.. ‘బాబు.. విశాఖ దాహం తీర్చండి.. మా నీటి కష్టాలు పట్టించుకోండి’ అంటూ నగరవాసులు కోరుతున్నారు.

ట్యాంకర్‌ నీటికి వేల రూపాయలు

నీటి సమస్యను ఆసరాగా చేసుకుని ప్రైవేట్‌ ట్యాంకర్ల నిర్వాహకులు అధిక మొత్తాలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జీవీఎంసీకి నామమాత్రపు రుసుము చెల్లించి నీటిని తీసుకెళ్లే ట్యాంకర్లు.. అదే నీటిని ప్రజలకు అధిక ధరకు విక్రయిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆరు వేల లీటర్ల ట్యాంకర్‌కు పరిధిని బట్టి జీవీఎంసీకి సుమారు రూ.300 వరకు చెల్లిస్తుండగా.. ప్రజల నుంచి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పటికే నీటి కోసం ఇబ్బందులు పడుతున్న కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోంది.

కుళాయి కోసం కాపలా..

నీటి సమస్య కేవలం తాగునీటితోనే ఆగడం లేదు. వంట, స్నానం, ఇంటి శుభ్రత, ఇతర నిత్యావసరాలన్నింటికీ నీరు అవసరం కావడంతో కుటుంబాల రోజువారీ జీవనం అస్తవ్యస్తమవుతోంది. ఉదయం కుళాయి ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూడటం.. వచ్చిన కొద్దిపాటి నీటిని బిందెల్లో నింపుకోవడం.. అది సరిపోకపోతే ట్యాంకర్‌ కోసం ఫోన్‌ చేయడం.. ఇలా రోజువారీ జీవితం నీటి చుట్టూనే తిరుగుతోందని నగరవాసులు చెబుతున్నారు. అపార్ట్‌మెంట్లలో ట్యాంకర్ల ఖర్చు పెరుగుతోంది. పేద, మధ్యతరగతి కుటుంబాలకు మాత్రం ఆ అదనపు భారం మరింత ఇబ్బందిగా మారుతోంది. బోర్లు ఎండిపోవడంతో సొంత నీటి వనరులపై ఆధారపడే అవకాశం కూడా లేకుండా పోయింది.

అక్టోబర్‌ తర్వాత పరిస్థితి ఏంటి?

ఇప్పటికే పలు ప్రాంతాల్లో నీటి కష్టాలు కొనసాగుతుండగా.. రాబోయే రోజుల్లో జలాశయాల పరిస్థితి మరింత దిగజారితే నగరంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. రైవాడ, మేహాద్రిగెడ్డ నుంచి ప్రస్తుతం మొత్తం 25.27 ఎంజీడీల నీరు అందుతోంది. అక్టోబర్‌లో ఈ వనరుల నిల్వలు తగ్గితే ఆ లోటును ఎక్కడి నుంచి భర్తీ చేస్తారన్నది కీలక ప్రశ్న. ముడసర్లోవ నుంచి సరఫరా దాదాపు నిలిచిపోగా.. గంభీరం నుంచి ఇప్పటికే నీరు రావడం లేదు. దీంతో ఏలేరు, తాటిపూడి, గోస్తనీ, శారదా తదితర వనరులపై మరింత ఆధారపడాల్సి ఉంటుంది. ఆ సమయంలో నగరంలోని ప్రస్తుత సరఫరాను కొనసాగించేందుకు జీవీఎంసీ వద్ద ఉన్న ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏమిటన్నది ప్రజలకు తెలియాల్సి ఉంది.

జీవీఎంసీకి ప్రస్తుతం ఏలేరు, రైవాడ, తాటిపూడి, మేహాద్రిగెడ్డ, ముడసర్లోవ, గంభీరం, గోస్తనీ, శారదా తదితర వనరుల నుంచి రోజుకు 88.41 ఎంజీడీల నీరు అందుతోంది. ఇందులో ఏలేరు నుంచే 46.91 ఎంజీడీలు వస్తుండటంతో నగర సరఫరాలో సగానికిపైగా దానిపైనే ఆధారపడుతోంది. ప్రస్తుతం ఏలేరులో 10.66 టీఎంసీల నిల్వ ఉండగా.. పురుషోత్తపట్నం స్టేజ్‌–2 ద్వారా 1,400 క్యూసెక్కుల నీటిని నింపుతున్నారు. తాటిపూడి నిల్వలు ఫిబ్రవరి 2027 వరకు సరిపోతాయని అంచనా ఉండగా.. రైవాడ, మేహాద్రిగెడ్డ నిల్వలు అక్టోబర్‌లో కీలక దశకు చేరనున్నాయి. ముడసర్లోవ ఇప్పటికే కనిష్ట నీటిమట్టం కంటే దిగువకు పడిపోయింది. గంభీరం నుంచి సరఫరా సున్నాకు చేరింది.

జలాశయాల్లో

తగ్గుతున్న

నిల్వలు

శివపూజ గణపతిగా

శ్రీ సంపత్‌ వినాయగర్‌

నీరులేక సాగుభూమిలా మారిన మేహాద్రిగెడ్డ జలాశయం

అడుగంటిన ముడసర్లోవ జలాశయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement