మహారాణిపేట: ఆశీలమెట్టలోని శ్రీ సంపత్ వినాయక స్వామి దేవాలయంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం నాల్గో రోజు శ్రీ త్రిముఖ గణపతి అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామున గణపతి హోమం, సామవేద పారాయణం, పంచామృతాభిషేకం, పుష్పార్చనలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 2,300 మందికి అన్నదానం, ఉచిత ప్రసాద వితరణ చేపట్టారు. భక్తి గీతాలు, కోలాటం, కూచిపూడి, జానపద నృత్య ప్రదర్శనలు, అన్నమయ్య కీర్తనల ఆలాపన ఆకట్టుకున్నాయి.


