ద్విచక్ర వాహనాల చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ద్విచక్ర వాహనాల చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్‌

Sep 13 2026 9:10 AM | Updated on Sep 13 2026 9:10 AM

పరవాడ: ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను శనివారం పరవాడ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ ఎల్‌.భాస్కరరావు తెలిపిన వివరాల ప్రకారం..ం వాడచీపురుపల్లిలో గత నెల 29న హోండా షైన్‌, ఈ నెల 11న హోండా యాక్టీవా వాహనాలు చోరీకి గురైనట్లు ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అనుమానితుడిగా అదే గ్రామానికి చెందిన మచ్చ రామచంద్రరావును అదుపులోకి తీసుకొని విచారించారు. విచారణలో అతడు పరవాడ, గాజువాక, మల్కాపురం ప్రాంతాల్లో ఐదు వాహనాల చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. అలాగే, నిందితుడికి సహకరించిన విశాఖపట్నానికి చెందిన దెబ్బ జోసెఫ్‌ కిశోర్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. రామచంద్రరావుపై గాజువాక, దువ్వాడ, మల్కాపురం పోలీస్‌ స్టేషన్లలో ఇప్పటికే చోరీ కేసులు నమోదై ఉన్నట్లు సీఐ తెలిపారు. చోరీ చేసిన నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకొని, నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును ఛేదించిన ఎస్‌ఐ భీమరాజు, క్రైమ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ఎస్‌.వి.సాయి సంతోష్‌, హెచ్‌సీ సునీల్‌, పీసీ కిశోర్‌లను సీఐ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement