మహారాణిపేట: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల కమిటీల్లో పలువురికి చోటు కల్పించారు. రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీలో ఇద్దరికి, జిల్లా అనుబంధ విభాగాల కమిటీల్లో ఆరుగురికి పదవులు కేటాయించారు. ఈ మేరకు శుక్రవారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర వాణిజ్య విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా కుల్లికూరి మంగరాజు (గాజువాక), రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా కంబాల సందీప్ (విశాఖ తూర్పు)ను నియమించారు. అదేవిధంగా జిల్లా అనుబంధ విభాగాల ఎస్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్‌గా శీరం రమణ (గాజువాక), వలంటీర్ విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా గొండేసి రామిరెడ్డి (గాజువాక), గ్రీవెన్స్ సెల్ ప్రధాన కార్యదర్శిగా కామిరెడ్డి వెంకటరెడ్డి (గాజువాక), జిల్లా ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ విభాగం కార్యదర్శిగా బోయిడపు బాబురావు (గాజువాక), జిల్లా వాణిజ్య విభాగం కార్యదర్శిగా కె. నీలాద్రిరెడ్డి (గాజువాక), జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శిగా పెద్దింటి మహేష్ (విశాఖ నార్త్)ను నియమించారు.


