వినాయక మండపం పనుల్లో విషాదం | - | Sakshi
Sakshi News home page

వినాయక మండపం పనుల్లో విషాదం

Sep 12 2026 1:54 AM | Updated on Sep 12 2026 1:54 AM

పనులు చేస్తుండగా జారిపడి వ్యక్తి మృతి

మల్కాపురం: వినాయక మండపం ఏర్పాటు పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. 58వ వార్డు పిలకవానిపాలెం ప్రాంతంలో వినాయక చవితి ఉత్సవాలకు మండపం పనులు జరుగుతున్నాయి. రాడ్‌ బెండింగ్‌ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కాకి వేణు (54) గురువారం రాత్రి ఐదు అడుగుల ఎత్తులో ఉండి మండపానికి అవసరమైన కర్రలను కడుతున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తూ కిందకు జారిపడటంతో తల వెనుక భాగంలో తీవ్ర గాయమైంది. స్థానికులు వెంటనే సెయింట్‌ ఆన్స్‌ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయంపై గాజువాక పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement