సింథియా: హిందూస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో సీనియర్ మేనేజర్ (ప్లానింగ్)గా పనిచేస్తున్న ఆదితమ్ కవిత ప్రతిష్టాత్మక ఐటీ ఇన్‌ఫ్రా గ్లోబల్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ అవార్డ్స్–2026లో ‘ఉమెన్ ఇన్ మారిటైమ్ లీడర్‌షిప్’ అవార్డును అందుకున్నారు. సముద్ర పరిశ్రమ, నౌకానిర్మాణ రంగాల్లో విశేష నాయకత్వం, వృత్తిపరమైన ప్రతిభ, నూతన ఆవిష్కరణలు, సేవలు అందిస్తున్న మహిళా నాయకులకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. దాదాపు రెండు దశాబ్దాలుగా డిజైన్, బిజినెస్ డెవలప్‌మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ తదితర విభాగాల్లో కవిత అందించిన సేవలను గుర్తించి ఈ గౌరవం దక్కిందని హెచ్‌ఎస్‌ఎల్ వర్గాలు తెలిపాయి.


