అల్లిపురం: జీవీఎంసీ పరిధిలో ఏపీడీపీఎంఎస్, ఎల్‌ఆర్‌ఎస్, టీడీఆర్ పెండింగ్ సమస్యల పరిష్కారానికి నిర్వహించిన ప్రత్యేక టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరంనకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. గురు, శుక్రవారాల్లో నిర్వహించిన ఫోరంలో మొత్తం 438 వినతులు అందగా, అందులో 237 అర్జీలు పరిష్కరించినట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఏపీడీపీఎంఎస్‌కు సంబంధించి 100, ఎల్‌ఆర్‌ఎస్‌కు 304, టీడీఆర్‌పై 34 వినతులు అందాయి. పరిష్కరించిన వాటిలో ఏపీడీపీఎంఎస్ 124, ఎల్‌ఆర్‌ఎస్ 95, టీడీఆర్ 18 ఉన్నాయి. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా పెండింగ్ సమస్యలను ఒకేచోట పరిష్కరించేందుకు ప్రత్యేక ఫోరం ఏర్పాటు చేసినట్లు కమిషనర్ కేతన్‌గార్గ్ ఈ సందర్భంగా0 తెలిపారు. అందిన ప్రతి అర్జీని నిబంధనల మేరకు క్షుణ్ణంగా పరిశీలించి, అనవసర జాప్యానికి తావులేకుండా పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న అంశాలను నిరంతరం పర్యవేక్షించి సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు.
రెండు రోజుల్లో 438 వినతులు..
237 దరఖాస్తుల పరిష్కారం


