కాలుష్యం పంజా విసరడంతో విశాఖ ప్రజలు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారు. అతి సూక్ష్మమైన పీఎం–2.5 కణాలు శ్వాస ద్వారా నేరుగా ఊపిరితిత్తులు, రక్తంలోకి ప్రవేశిస్తుండటంతో శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నాయి. ఆస్తమా, బ్రోంకై టిస్, అలర్జీలు, కంటి మంటల సమస్యలతో ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు ఈ కాలుష్య గాలిని పీల్చి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేజీహెచ్, ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రుల్లో నమోదవుతున్న ఓపీ కేసులే ఇందుకు సజీవ సాక్ష్యం.


