కోటి గాజులు.. 117 అడుగులు | - | Sakshi
Sakshi News home page

కోటి గాజులు.. 117 అడుగులు

Sep 11 2026 8:22 AM | Updated on Sep 11 2026 8:22 AM

కోటి గాజులతో, 117అడుగుల్లో దివ్య కంకణ అలంకార మహాగణపతి గాజువాక శ్రీనగర్‌లో కొలువుదీరనున్నారు. 120 అడుగుల ఎత్తున్న మండపంలో టిప్పరు మట్టి, 400 వెదురు బొంగులతో అనకాపల్లి జిల్లాకు చెందిన ఆరిపాక కృష్ణ ఆధ్వర్యంలో 26మంది కళాకారులు రెండు నెలలుగా ఈ విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. యమలోకం సెట్‌, డైనోసర్‌ పార్కు కూడా తీర్చిదిద్దారు. ఇక్కడ రవిచంద్ర ఆర్ట్స్‌ రూపొందించిన ఏఐ వినాయకుడి విగ్రహం భక్తులతో మాట్లాడనుంది. ఎస్వీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ భారీ వినాయకుడికి ప్రతిష్టించిన చోటే అనుపు మహోత్సవం మహోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు కొసిరెడ్డి గణేష్‌, కొసిరెడ్డి పృథ్వి తెలిపారు.

– గాజువాక

– గాజువాకలో భారీ గణపతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement