ప్రకృతికి, మానవ జీవనానికి నడుమ ఉన్న అవినాభావ సంబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించే పర్వదినం వినాయక చవితి. మరో నాలుగు రోజుల్లో ఆ గణనాథుడి ఆగమనం అనగానే, ఊరూ..వాడా ఆధ్యాత్మిక శోభతో పరవశిస్తోంది. ప్రకృతే మన మూలం.. ప్రకృతిలోనే మన గమ్యం అనే జీవన సత్యాన్ని చాటుతూ మృణ్మయ రూపాన్ని మలచడంలో కొందరు కళాకారులు నిమగ్నం కాగా.. సృజనాత్మకతకు కొత్త రంగులు అద్దుతూ విభిన్నంగానూ విగ్రహాలు రూపొందుతున్నాయి. కేవలం మట్టికే పరిమితం కాకుండా, అంబరమంత భక్తితో సాగర గర్భాన లభించే గవ్వలను అపురూపమైన బొజ్జ గణపయ్యగా తీర్చిదిద్దుతున్నారు. ఇక స్వచ్ఛతకు ప్రతీక అయిన అమూల్యమైన ముత్యాలను పేర్చి దైవిక కాంతులు వెదజల్లే ఏకదంత రూపాలకూ ప్రాణం పోస్తున్నారు. ఇలా మట్టి పరిమళం నుంచి ముత్యాల శోభ వరకు భిన్న ఆకృతుల్లో సిద్ధమవుతున్న పార్వతీ నందనుడికి స్వాగతం పలికేందుకు నగరమంతా ముస్తాబవుతోంది.
– ఫొటోలు: సాక్షి, ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం
ఫ్యాంట్, షర్ట్‌తో మోడర్న్ గణేశుడు
హయగ్రీవుడి ఒడిలో
బుజ్జి గణపతి
సైకిల్‌పై స్వారీకి సిద్ధం..
భిన్న ఆకృతుల్లో
బొజ్జ గణపయ్య


