ఏయూ క్యాంపస్: సాగర తీరంలో స్వచ్ఛత అభియాన్ కార్యక్రమంలో ఐఏటీవో సభ్యులు పాల్గొన్నారు. ఆర్.కె బీచ్ వద్ద సముద్ర తీరంలో ఉన్న వ్యర్ధాలను ఏరివేసి గురువారం స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. విశాఖ వేదికగా జరుగుతున్న ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (ఐఏటీవో) వార్షిక సమ్మేళనంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఐఏటీవో సభ్యులు పెద్దసంఖ్యలో పాల్గొని సాగర తీరంలో ఉన్న పాలిథిన్ కవర్లు, ప్లాస్టిక్ సీసాలు, ఇతర వ్యర్థాలను ఏరివేసి జీవీఎంసీ సిబ్బందికి అందజేశారు. ఐఏటీవో అధ్యక్షుడు రవి గోసైన్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రజనీష్ కై స్థా, వైస్ ప్రెసిడెంట్ సంయజ్ రజ్ఞాన్, ఏిపీ టూరిజం అధికారులు తదితరులు పాల్గొన్నారు.


