సర్కారు ఉదాసీనత– అధికారుల నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

సర్కారు ఉదాసీనత– అధికారుల నిర్లక్ష్యం

Sep 11 2026 8:22 AM | Updated on Sep 11 2026 8:22 AM

విశాఖలో కాలుష్యానికి వాతావరణంలో వస్తున్న మార్పులే కారణమంటూ ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలు బాధ్యతల నుంచి తప్పుకునే ప్రయత్నంలా ఉన్నాయని ప్రజలు మండిపడుతున్నారు. పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలను గాలికొదిలేశారన్న విమర్శలు వస్తున్నాయి. పరిశ్రమలు కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటిస్తున్నాయా లేదా అని తనిఖీ చేయాల్సిన ఏపీపీసీబీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కాలుష్య నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోకపోతే విశాఖ నగరం మరో ‘ఢిల్లీ’గా మారే ప్రమాదముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement