న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి

Sep 11 2026 8:04 AM | Updated on Sep 11 2026 8:04 AM

● కళ్లకు నల్ల గుడ్డ కట్టుకొని కాంట్రాక్టు ఉద్యోగుల నిరసన ● కేజీహెచ్‌ ప్రాంగణంలో మానవహారం, నిరసన

మహారాణిపేట: తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కాంట్రాక్టు ఉద్యోగులు నిరసన చేపట్టారు. గురువారం కేజీహెచ్‌ ప్రాంగణంలో కళ్లకు నల్లగుడ్డలు కట్టుకుని మానవహారం, నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్‌ ఎస్‌.కె.ఆశా మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో ఏళ్ల తరబడి సేవలందిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరినీ తక్షణమే రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. రెగ్యులరైజేషన్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకు 100 శాతం గ్రాస్‌ వేతనం చెల్లించాలన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించడంతో పాటు, కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం కల్పించాలని కోరారు. ఉద్యోగుల భవిష్యత్‌ భద్రత కోసం ఈపీఎఫ్‌ సౌకర్యం కల్పించాలన్నారు. జిల్లా జేఏసీ కన్వీనర్‌ కిశోర్‌రావు మాట్లాడుతూ పీహెచ్‌సీల నుంచి టీచింగ్‌ ఆస్పత్రుల వరకు పగలు, రాత్రి తేడా లేకుండా ప్రజలకు వైద్య సేవలందిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement