‘ఇరుముడి’
విజయంపై హర్షం
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని సినీ దర్శకుడు శివ నిర్వాణ కుటుంబసమేతంగా బుధవారం దర్శించుకున్నారు. ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అంతరాలయంలో ఆయన పేరిట అర్చకులు అష్టోత్తరపూజ నిర్వహించారు. వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వామివారి ప్రసాదం, శేషవస్త్రంలను ఏఈవో పిల్లా శ్రీనివాసరావు అందించారు. ఇటీవల తాను దర్శకత్వం వహించిన ఇరుముడి సినిమా విశేషంగా ప్రేక్షకాదరణ పొందడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.


