కార్మిక నేత బలరాం కన్నుమూత | - | Sakshi
Sakshi News home page

కార్మిక నేత బలరాం కన్నుమూత

Sep 10 2026 3:50 AM | Updated on Sep 10 2026 3:50 AM

కొమ్మాది: కార్మిక నేత, స్వాతంత్య్ర సమరయోధుడు కె.బలరాం (100) బుధవారం సాగర్‌నగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ఆయన చురుకుగా పాల్గొన్నారు. అనంతరం కార్మిక రంగంలోనూ విశేష సేవలందించారు. ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేసి కార్మికుల హక్కుల సాధన కోసం అలుపెరుగని పోరాటం చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం, హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌, నేవల్‌ డాక్‌యార్డ్‌ వంటి భారీ పరిశ్రమల్లో పనిచేసి వేలాది మంది కార్మికుల సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ, కార్మిక సంఘాల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement