మద్దిలపాలెం: సుప్రసిద్ధ ప్రవచనకారుడు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ప్రతిష్టాత్మక కొప్పరపు కవుల జాతీయ ప్రతిభా పురస్కారం–2026కు ఎంపికయ్యారు. కొప్పరపు కవుల కళాపీఠం 24వ వార్షికోత్సవం సందర్భంగా బుధవా రం సాయంత్రం 6 గంటలకు కళాభారతి ఆడిటోరియంలో పురస్కార ప్రదాన కార్యక్రమం జరగనుంది. మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నా యుడు, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాద్, అమెరికాకు చెందిన హృద్రోగ నిపుణుడు డాక్టర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి అతిథులుగా హాజరుకానున్నారు. మహా సహస్రావధాని డాక్టర్ మాడుగుల నాగఫణిశర్మ సభకు అధ్యక్షత వహించనున్నారు. విశిష్ట అతిథులుగా ఆచార్య విశ్వనాథ గోపాలకృష్ణశాస్త్రి, ఆచార్య తాడేపల్లి పతంజలిశాస్త్రి హాజరుకానున్నారు. భారతీభూషణ రాంభట్ల నృసింహశర్మ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారని పీఠం అధ్యక్షుడు మాశర్మ తెలిపారు.


