ఆరిలోవ: డీఎస్సీ నియామక ప్రక్రియలో జిల్లాలో స్పోర్ట్స్ కోటా ద్వారా ఎంపికై న అభ్యర్థుల జాబితా వివరాలను వెల్లడించాలని వైఎస్సార్‌సీపీ ఆర్టీఐ విభాగం నాయకులు మంగళవారం విద్యాశాఖ అధికారులను కోరారు. ఈ మేరకు డీఈవో కార్యాలయంలో అదనపు డైరెక్టర్ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలో స్పోర్ట్స్ కోటా ద్వారా ఎంపికై న అభ్యర్థుల పూర్తి వివరాలను రికార్డుల ఆధారంగా వెల్లడించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఆర్టీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు జీలకర్ర నాగేంద్ర మాట్లాడుతూ డీఎస్సీ ద్వారా స్పోర్ట్స్ కోటాలో ఎంపికై న అభ్యర్థుల పేర్లు, వారి ఎంపికకు సంబంధించిన పూర్తి వివరాలు, అభ్యర్థుల ప్రాంతాలు, ఏ పాఠశాలల్లో పోస్టింగులు పొందారనే వివరాలు, టెట్ అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య, వారి పేర్లను విద్యాశాఖ అధికారులు వెల్లడించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వడ్డాది కుమార్, దశమంతుల చిన్న, శ్రీవంశీ, షేక్ బాబ్జి, బాలకృష్ణ, సంతోష్ కుమార్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.


