మహారాణిపేట: ప్రజా సమస్యలను ఎండగడుతూ వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో ప్రచార విభాగం కీలకంగా పనిచేస్తుందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షులు కే. రాజశేఖర్ అన్నారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఉత్తరాంధ్ర ప్రచార కమిటీ అధ్యక్షులు, జోన్–1 జీవీ రవి రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార విభాగం విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యంగా ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తామని రాజశేఖర్ తెలిపారు. విశాఖ భూఅక్రమణలు, భోగాపురం విమానాశ్రయ బాధితుల సమస్యలు, గూగుల్ డేటా సెంటర్‌కు భూముల కేటాయింపుతో ప్రభావితమైన వారి సమస్యలపై ప్రజల్లో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. జీవీ రవి రాజు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఉత్తరాంధ్రలో ప్రచార కమిటీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో ప్రచార కమిటీ జిల్లా అధ్యక్షుడు ఉమ్మడి కళ్యాణ్, జి. మనోజ్ కుమార్, పి. ఈశ్వర్‌రావు, బోర కుమార్ రెడ్డి, సంపంగి సురేష్, దల్లి రామకృష్ణారెడ్డి, పాత్రో శ్రీనివాస్, జి. వెంకట రమణారెడ్డి, వి. ఈశ్వరరావు, సి.ఎస్. రెడ్డి, జీరి వెంకటరెడ్డి, వి. జ్యోతి ప్రకాష్, ఎస్. గణేష్ రెడ్డి, గంటా కామరాజు తదితరులు పాల్గొన్నారు.


