సీతంపేట: కార్మికులకు కనీస వేతనాల వ్యత్యాసం కింద 2లక్షల 81 వేల 607 రూపాయలను సంబంధిత యాజమాన్యాలు చెల్లించాయి. కార్మికశాఖ అధికారులు ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో కనీస వేతనాల కంటే తక్కువమొత్తంలో వేతనాలు చెల్లిస్తున్నట్టు గుర్తించి, సంబంధిత యాజమాన్యాలకు సూచనలు చేశారు. స్పందించిన యాజమాన్యాలు ఈ బకాయి మొత్తాన్ని 24 మంది కార్మికులకు అందజేశారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ ఉప కమిషనర్ కె.దినేష్‌కుమార్ మాట్లాడుతూ కార్మికులకు చట్టపరంగా అందాల్సిన కనీస వేతనాలు పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. యాజమాన్యాలు కార్మిక చట్టాలను తప్పనిసరిగా పాటించేలా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని కొనసాగిస్తూనే, కార్మిక చట్టాలను అమలుకు ప్రాధాన్యమిస్తామని పేర్కొన్నారు.


