ఎంవీపీకాలనీ: జలవనరులశాఖ ఉత్తరాంధ్ర చీఫ్ ఇంజినీర్‌గా డి.తిరుమలరావు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు సీఈగా ఉన్న రామ్‌గోపాల్ ఇటీవల ఉద్యోగ విరమణ చేయడంతో, తిరుమలరావును ఆ స్థానంలో ప్రభుత్వం నియమించింది. దీంతో ఆయన సోమవారం ఉషోదయ జంక్షన్‌లోని కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. గతంలో విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన ప్రస్తుతం ధవళేశ్వరంలో ఎస్‌ఈగా విధులు నిర్వర్తిస్తూ, పదోన్నతిపై ఇక్కడికి వచ్చారు. పలువురు విభాగ ఇంజినీరింగ్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో డిప్యుటీ ఇంజినీర్ శ్రీహరి, ఈఈ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.


