విశాఖ కేంద్ర కారాగారంలో బోర్డు ఆఫ్‌ విజిటర్స్‌ సమావేశం | - | Sakshi
Sakshi News home page

విశాఖ కేంద్ర కారాగారంలో బోర్డు ఆఫ్‌ విజిటర్స్‌ సమావేశం

Sep 6 2026 2:13 AM | Updated on Sep 6 2026 2:13 AM

ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారంలో శనివారం బోర్డు ఆఫ్‌ విజిటర్స్‌ సమావేశం నిర్వహించారు. తొలుత కారాగారంలోని బ్యారక్‌లు, పరిశ్రమలు, వంటశాల తదితర విభాగాలను అధికారులు పరిశీలించారు.అనంతరం విశాఖ ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి జి. శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ విద్యాధరి, డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ సీహెచ్‌. మణికంఠ, జైలు సూపరింటెండెంట్‌ బి. చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.సమావేశంలో ఖైదీల నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, పునరావాసం, సంక్షేమం, భద్రత, ఆరోగ్యం, వృత్తి నైపుణ్యాల పెంపు, జైలు పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఖైదీల సంక్షేమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం సమావేశంలో పాల్గొన్న అధికారుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement