అక్కిరెడ్డిపాలెం : నిరంతర సాధన, పట్టుదలతో విభిన్న రంగాల్లో రాణిస్తున్న గాజువాకకు చెందిన తొమ్మిదేళ్ల చిన్నారి పాలమంగళం చిహ్నికకు ప్రతిష్టాత్మక గ్లోబల్ ఇన్‌స్పిరేషన్ అంతర్జాతీయ అవార్డు– 2026 లభించింది. కరాటే అథ్లెట్‌గా, మోడల్‌గా, డ్యాన్సర్‌గా, యంగ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా, చైల్డ్ కంటెంట్ క్రియేటర్‌గా చిహ్నిక ప్రతిభ చాటుతోంది. గాజువాకలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న ఆమె రాజేష్, హారిక దంపతుల కుమార్తె. తల్లిదండ్రులు, శిక్షకుల ప్రోత్సాహంతో విద్యతో పాటు పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, మోడలింగ్, కరాటే రంగాల్లో సాధించిన విజయాలకు గుర్తింపుగా ఈ అవార్డుకు ఎంపికై ంది. పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్, తెలుగు ఎక్స్‌పాట్స్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా సంయుక్తంగా ఈ పురస్కారాన్ని ప్రకటించాయి. ఈ నెల 9న మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో జరగనున్న కార్యక్రమంలో చిహ్నిక అవార్డును అందుకోనుంది. చిన్నారి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంపై పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రులు, క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


