శ్రీకాకుళం జిల్లా రావిచెంద్రిలో
విశాఖ విద్యార్థి మృతి
హిరమండలం(శ్రీకాకుళం): స్నేహితుడి పుట్టిన రోజు వేడుకల కోసం వచ్చి చెరువులో స్నానానికి దిగి ఓ విద్యార్థి మృతిచెందాడు. ఎల్‌ఎన్ పేట మండలం రావిచంద్రిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రావిచంద్రికి చెందిన ఓ యువకుడి పుట్టిన రోజు వేడుకకు వివిధ ప్రాంతాల నుంచి 20 మంది స్నేహితులు వచ్చారు. అందరూ కలిసి సరదాగా చెరువులో స్నానానికి దిగారు. అందులో మోహనరావు(16) అనే బాలుడికి ఈత రాకపోవడంతో మునిగిపోయాడు. స్నేహితులతో పాటు స్థానికులు కలిసి గాలించి బయటకు తీశారు. వెంటనే ఆటోలో ఎల్‌ఎన్ పేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మోహనరావు స్వస్థలం విశాఖపట్నంలోని జ్ఞానాపురం. ఐటీఐ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితుడి బర్త్ డే వేడుకలకు గురువారం ఉదయం రావిచంద్రి వచ్చాడు. మోహనరావు తండ్రి జగన్ వంట మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. తల్లి చిట్టి గృహిణి. సరుబుజ్జిలి పోలీసులు పీహెచ్‌సీకు చేరుకుని వివరాలు సేకరించారు.


