పెందుర్తి: వేపగుంట సమీపంలోని నాయుడుతోట వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం పాలైంది. వివరాలివి.. నగరంలోని ఐటీఐ కూడలిలో నివాసం ఉంటున్న మైచర్ల సంతోషి(35) విజయనగరం జిల్లా కొత్తవలసలో పని నిమిత్తం గురువారం ఉదయం స్కూటీపై వెళ్లింది. పని ముగించుకుని తిరిగి వస్తుండగా నాయుడుతోట సమీపంలో వాటర్ ట్యాంకర్ వెనుక నుంచి ఢీకొంది. దీంతో సంతోషి తుళ్లి రోడ్డుపై పడిపోయింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందుకున్న పెందుర్తి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సంతోషి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. పెందుర్తి పోలీసులు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు.


