ఆరిలోవ: వెల్లంకి ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న తాతపూడి పూజిత గోల్ షార్ట్‌బాల్ క్రీడలో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచింది. ఆమెను గురువారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈవో ఎన్.ప్రేమకుమార్ అభినందించారు.గత నెల 24 నుంచి 27వ తేదీ వరకు జరిగిన అండర్–15 గోల్ షార్ట్‌బాల్ ఫైనల్ మ్యాచ్‌లో పూజిత భారత జట్టు తరఫున పాల్గొని భూటాన్‌కు చెందిన క్రీడాకారిణిపై విజయం సాధించింది. ఈ సందర్భంగా డీఈవో ఆమెను అభినందించి రూ.5 వేల నగదు ప్రోత్సాహక బహుమతిని అందజేశారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏపీసీ చంద్రశేఖర్, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు తోనంగి సరిత, ప్రధానోపాధ్యాయుడు దాడిశెట్టి రమేష్‌కుమార్ పూజితను అభినందించారు.


