సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీల్లో విశాఖ జిల్లాకు చెందిన పలువురు నాయకులకు కీలక బాధ్యతలు దక్కాయి. ఈ మేరకు గురువారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నియామకాల్లో భాగంగా రాష్ట్ర లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శిగా కాండ్రేగుల జగదీశ్వరరావు(విశాఖ దక్షిణ), రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా వుడా శ్రీనివాసరావు(విశాఖ తూర్పు) నియమితులయ్యారు. అలాగే రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా సూరాడ అనుదీప్ (విశాఖ పశ్చిమ), కార్యదర్శిగా ఆడారి హరీష్(విశాఖ పశ్చిమ), సంయుక్త కార్యదర్శిగా రేసపు శ్రీనివాసరెడ్డి(విశాఖ పశ్చిమ) నియమితులయ్యారు. ఇక రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శిగా పిల్లి జయప్రద(విశాఖ ఉత్తర)ను నియమించారు.


