సీనియర్‌ జర్నలిస్ట్‌ శ్రీనుబాబుకు ఉగాది పురస్కారం | - | Sakshi
Sakshi News home page

సీనియర్‌ జర్నలిస్ట్‌ శ్రీనుబాబుకు ఉగాది పురస్కారం

Mar 20 2026 7:50 AM | Updated on Mar 20 2026 7:50 AM

మహారాణిపేట: పాత్రికేయ, సామాజిక సేవా రంగాల్లో విశేష కృషి చేస్తున్న సీనియర్‌ పాత్రికేయుడు గంట్ల శ్రీనుబాబు రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. గురువారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ముఖ్యమంత్రి ఆయన్ని శాలువాతో సత్కరించి, తెలుగు తల్లి జ్ఞాపిక, రూ.10 వేల నగదు పురస్కారం, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనుబాబును తోటి పాత్రికేయులు, మిత్రులు అభినందనలు తెలిపారు. కాగా.. ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌ నాయకుడిగా, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement