వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో న్యూ ఇయర్ సంబరాలు
మహారాణిపేట: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గురువారం మద్దిలపాలెంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు జరిగాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో కేక్ కోసి సంబరాలు జరుపుకొన్నారు. అనంతరం కేకే రాజును విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, ఎస్‌ఈసీ సభ్యులు బాణాల శ్రీనివాసరావు, రొంగలి జగన్నాథం, పార్టీ నాయకులు గొలగాని శ్రీనివాసరావు, పల్లా చిన్నతల్లి, నడింపల్లి కృష్ణంరాజు, కార్పొరేటర్లు కటారి అనిల్ రాజు, అల్లు శంకరరావు, పి.వి.సురేష్, గుండప్ప నాగేశ్వరరావు, బల్ల లక్ష్మణ్, బర్కత్ అలీ కలిశారు. వీరితో పాటు వార్డు అధ్యక్షులు, పార్టీ పరిశీలకులు, రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు కేకే రాజుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.


