ఆసక్తిగా ఎన్టీపీసీలో మాక్‌ డ్రిల్‌ | - | Sakshi
Sakshi News home page

ఆసక్తిగా ఎన్టీపీసీలో మాక్‌ డ్రిల్‌

Jan 1 2026 11:00 AM | Updated on Jan 1 2026 11:00 AM

ఆసక్త

ఆసక్తిగా ఎన్టీపీసీలో మాక్‌ డ్రిల్‌

పరవాడ: అత్యవసర పరిస్థితుల్లో భద్రతా దళాల స్పందన సామర్థ్యాలను పరీక్షించడంలో భాగంగా సింహాద్రి ఎన్టీపీసీలో బుధవారం మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్‌ సిన్హా ఆదేశాల మేరకు సంస్థ ప్రాంగణంలో బాంబు ముప్పును ఎదుర్కొనే సన్నద్ధతపై ఈ మాక్‌ డ్రిల్‌ జరిపినట్లు అధికారులు తెలిపారు. సంస్థ ఈడీ సమీర్‌శర్మ, సీఐఎస్‌ఎఫ్‌ డిప్యూటీ కమాండెంట్‌ రాజ్‌కుమార్‌, పరవాడ సీఐ ఆర్‌.మల్లికార్జునరావు నేతృత్వంలో జిల్లా బాంబు డిస్పోజల్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ తనిఖీల్లో పాల్గొన్నాయి. పరవాడ పోలీస్‌ సిబ్బంది, సీఐఎస్‌ఎఫ్‌ బలగాలు, ఎన్టీపీసీ భద్రతా విభాగం పాల్గొని, మాక్‌ డ్రిల్‌ను విజయవంతం చేశారు. భద్రతా బృందాలు నమూనా బాంబును గుర్తించి చాకచక్యంగా నిర్వీర్యం చేశాయి. అత్యంత క్రమశిక్షణతో సాగిన ఈ మాక్‌డ్రిల్‌ పూర్తిస్థాయిలో విజయవంతమైందని, పారిశ్రామిక ప్రాంతాల్లో భద్రతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉన్నారని సీఐ మల్లికార్జునరావు పేర్కొన్నారు.

ఆసక్తిగా ఎన్టీపీసీలో మాక్‌ డ్రిల్‌ 1
1/1

ఆసక్తిగా ఎన్టీపీసీలో మాక్‌ డ్రిల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement