వెంకన్న అలంకారంలో దర్శనమిచ్చిన అప్పన్న
సింహాచలం: సింహగిరిపై జరుగుతున్న రాపత్తు ఉత్సవాల్లో భాగంగా రెండవరోజు బుధవారం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వేంకటేశ్వరుడి అలంకారంలో దర్శనమిచ్చాడు. స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని వేంకటేశ్వరస్వామిగా అలంకరించి శ్రీదేవి, భూదేవి సమేతంగా పల్లకిలో వేంజేపచేశారు. ఆళ్వారులను మరొక పల్లకిలో అధిష్టింపజేశారు. సింహగిరి మాడ వీధుల్లో ఘనంగా తిరువీధి నిర్వహించారు. తిరువీధిలో భక్తులు స్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు తదితరులు ఈ కార్యక్రమం నిర్వహించారు.
వెంకన్న అలంకారంలో దర్శనమిచ్చిన అప్పన్న


