రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ‘ఆర్యభట్ట’ విద్యార్థులు
సబ్బవరం: విశాఖపట్నం జిల్లా స్థాయి పాలిటెక్నిక్ కళాశాలల గేమ్స్, స్పోర్ట్స్ మీట్‌లో స్థానిక ఆర్యభట్ట పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వాలీబాల్ బాలుర విభాగంలో విన్నర్స్‌గా, బాలికల విభాగంలో రన్నర్స్‌గా, ఖోఖో, బ్యాడ్మింటన్‌లో తృతీయ స్థానం, 100 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానంలో నిలిచినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.సుధీర్‌బాబు బుధవారం మీడియాకు తెలిపారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులను కళాశాల చైర్మన్ మహందత్ నాయుడు అభినందిస్తూ రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పీడీ ప్రవీణ్, వైస్ ప్రిన్సిపాల్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.


