చెరువును పూడ్చేస్తున్నారు
పరవాడ: మండలంలోని నాయుడుపాలెం ఽశివారు రాముడుగారి గ్రామంలోని రాముడుగారి చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు వ్యర్థాలను డంప్ చేస్తున్నారు. దీంతో చెరువు గర్భం పూడికలతో నిండిపోతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాల్లోని పనికిరాని చెట్లను తొలగించి ట్రాక్టర్లపై తీసుకొచ్చి చెరువులో వేస్తున్నారు. పాత ఇళ్లను తొలగిస్తున్న క్రమంలో వాటి డెబ్రిస్‌ను చెరువులో వేస్తుండటంతో రాన్రానూ చెరువు పూడుకుపో తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వ్యవసాయ పంటలకు సమృద్ధిగా నీరందడం కష్టంగా మారిందని చెప్తున్నారు. రాము డుగారి చెరువును కాపాడేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.


