నీరు శుద్ధి చేయాలంటే.. భయం భయం
పరవాడ: వాడచీపురుపల్లిలో సింహాద్రి ఎన్టీపీసీ ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి ట్యాంకుకు నిర్మించిన మెట్ల మార్గం, రక్షణ గోడలు శిథిలావస్థకు చేరడంతో సిబ్బంది అందోళన చెందుతున్నారు. ట్యాంకుపైకి వెళ్లడానికి ఏర్పాటు చేసిన మెట్ల మార్గం ఎక్కడికక్కడ విరిగిపోయింది. దీంతో బ్లీచింగ్ చేసే సిబ్బంది ట్యాంకుపైకి వెళ్లడానికి భయపడుతున్నారు. ట్యాంకుపైన, చుట్టూ ఏర్పాటు చేసిన సిమెంటు రక్షణ గోడలు కూడా విరిగి కింద పడుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి మరమ్మతులతో మూల్గుతున్న రక్షిత మంచినీటి పథకానికి రిపేర్లు చేపట్టాలని ప్రజలు, సిబ్బంది కోరుతున్నారు.


