నేటి నుంచి ఆన్‌లైన్‌లో అప్పన్న ఉత్తరద్వార దర్శనం టికెట్
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఉత్తర ద్వార దర్శనం టికెట్లను శుక్రవారం నుంచి ఆన్‌లైన్‌లో లభ్యం కానున్నాయి. ఈనెల 29 తేదీ సాయంత్రం 5 గంటల వరకు రూ.100, రూ.300, రూ.500 టికెట్లు అందుబాటులో ఉంటాయని దేవస్థానం ఇన్‌చార్జి ఈవో ఎన్.సుజాత తెలిపారు. www.aptemples.ap.gov.in వెబ్‌సైట్‌లో కానీ, మనమిత్ర వాట్సాప్ నెంబరు 9552300009 ద్వారా కానీ భక్తులు టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆఫ్‌లైన్‌లో ముక్కోటి దర్శనం టికెట్లు లభ్యం కావని తెలిపారు. 30న ముక్కోటి ఏకాదశి దర్శనం ముగిసిన తర్వాత సింహగిరిపై కౌంటర్లలో యథావిధిగా దర్శనం టికెట్లు విక్రయాలు జరుగుతాయని తెలిపారు.


