పింఛన్ కోసం దివ్యాంగుడి తల్లి ఆవేదన
తమ కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక కష్టాలను తీర్చడానికి ప్రభుత్వం వెంటనే స్పందించి దివ్యాంగుల పింఛన్ మంజూరు చేయాలని పూర్ణామార్కెట్ ఏరియాకు చెందిన రామలక్ష్మి జాయింట్ కలెక్టర్‌ను వేడుకుంది. చిన్న వయసులోనే కుమారుడు సతీష్ పక్షవాతానికి గురికావడంతో అన్నీ తానై చూసుకోవాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కనీసం తన కాలకృత్యాలు కూడా తీర్చుకోలేని స్థితిలో మంచానికే పరిమితమైన కుమారుడిని పోషించడం తమకు భారంగా మారిందని, ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేసింది. పింఛన్ కోసం కలెక్టర్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నామని, ఇప్పటికై నా మానవతా దృక్పథంతో స్పందించి పింఛన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది.


