దృష్టి లోపం ఉన్న వారికి మేలు చేసేలా..
బ్రెయిలీ లిపి లెర్నింగ్ పరికరం
అభివృద్ధి చేసిన ప్రొఫెసర్
కొమ్మాది: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ మహమ్మద్ ఖ్వాజా మొయినుద్దీన్ దృష్టి లోపం ఉన్నవారికి మరింత సులభంగా అర్థమయ్యే విధంగా బ్రెయిలీ లిపి లెర్నింగ్ పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఈ పరికరాన్ని మంగళవారం వర్సిటీలో ప్రదర్శించారు. దీని వల్ల దృష్టి లోపం ఉన్న వారు మరింత వేగంగా, సులభంగా నేర్చుకోవడానికి వీలుంటుందని ప్రొఫెసర్ తెలిపారు. ఈ పరికరం వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొనడంతోపాటు అది ఎలా పని చేస్తుందో కూడా వివరించారు.


