1 నుంచి హనుమత్ వ్రతం ఉత్సవాలు
సింహాచలం: సింహగిరి మెట్లమార్గంలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో డిసెంబర్ 1 నుంచి 3 వరకు హనుమత్ వ్రతం ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు సింహాచలం దేవస్థానం ఇన్‌చార్జి ఈవో ఎన్.సుజాత మంగళవారం తెలిపారు. డిసెంబర్ 1న ఉదయం 7.30 నుంచి 11.30 వరకు గణపతిపూజ, పుణ్యాహవచనం, సుందరకాండ పారాయణం, 2వ తేదీ ఉదయం 7.30 నుంచి 11.30 వరకు సుందరకాండ పారాయణం ఉంటాయన్నారు. 3న ఉదయం 6 నుంచి స్వామికి పంచామృతాభిషేకం, విశేష అలంకరణ, 7.30 నుంచి లక్ష తమలపాకుల పూజ, 9 నుంచి పట్టాభిషేక పారాయణం, 9.30 నుంచి విశేష హవనం, పూర్ణాహుతి జరుగుతాయన్నారు. కార్యక్రమాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను తీసుకోవాల్సిందిగా కోరారు.


