సింహగిరిపై నేడు షెడ్ ప్రారంభం
సింహాచలం: సింహగిరిపై ఆలయ ఉత్తర రాజగోపురం ఎదురుగా ఏర్పాటు చేసిన పర్మినెంట్ షెడ్ పనులు పుర్తయ్యాయి. గురువారం ఉదయం షెడ్‌ను ప్రారంభించేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి జరిగే ప్రముఖ ఉత్సవాల రోజుల్లో ఉత్తర రాజగోపురం ఎదురుగా పెద్ద ఎత్తున భక్తుల కోసం ఇప్పటి వరకు తాత్కాలికంగా పెండాల్స్, షామియానాలు ఏర్పాటు చేసేవారు. దీంతో దాతల సహకారంతో పర్మినెంట్ షెడ్ ఏర్పాటు చేయాలని దేవస్థానం అధికారులు భావించారు. చైతన్య విద్యా సంస్థలు రూ.రెండున్నర కోట్లతో షెడ్‌ను ఏర్పాటు చేసింది. నిర్మాణం పూర్తికావడంతో బుధవారం ఉదయం షెడ్ ప్రారంభోత్సవం చేయనున్నారు.


