కాంట్రాక్టర్ల కన్నెర్ర | - | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టర్ల కన్నెర్ర

Nov 26 2025 7:01 AM | Updated on Nov 26 2025 7:01 AM

కాంట్

కాంట్రాక్టర్ల కన్నెర్ర

13 నెలలుగా జీవీఎంసీ కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు బంద్‌

న్యూస్‌రీల్‌

ఈ నెలాఖరులోగా బిల్లులు చెల్లిస్తేనే పనులు కొనసాగిస్తాం లేదంటే వచ్చే నెల 1 నుంచి టూల్‌ డౌన్‌ చేస్తామని అల్టిమేటం
13 నెలలుగా జీవీఎంసీ కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు బంద్‌
ఇప్పటికే రూ.460 కోట్ల బకాయిలు మరో రూ.300 కోట్ల మేర పూర్తయిన పనులకూ ఇబ్బందులే.. గత పదేళ్లల్లో మొదటిసారిగా కాంట్రాక్టర్ల టూల్‌ డౌన్‌

బుధవారం శ్రీ 26 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

వచ్చే నెల 3 నుంచి

శ్రీ నృసింహ దీక్షలు

సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ నృసింహ దీక్షలు డిసెంబరు 3వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని దేవస్థానం ఇన్‌చార్జి ఈవో ఎన్‌.సుజాత తెలిపారు. దేవస్థానం వైదికులు నిర్ణయించిన ప్రకారం డిసెంబరు 3వ తేదీ నుంచి మండల దీక్ష, డిసెంబరు 11వ తేదీ నుంచి 32 రోజుల దీక్ష ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. మాలధారణ చేసే భక్తులకు దేవస్థానం తరపున తులసి మాల, స్వామి ప్రతిమ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 12న రెండు దీక్షలు విరమించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

రాష్ట్ర ఖజానాకు మళ్లింపు..!

త ప్రభుత్వ హయాంలో జీవీఎంసీ వచ్చే ఆదాయాన్ని ఇక్కడే వినియోగించుకునేవారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం జీవీఎంసీ నుంచి వచ్చే ఆదాయాన్ని నేరుగా రాష్ట్ర ఖజానాకు మళ్లిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీవీఎంసీకి చెల్లించే వివిధ పన్నులను కూడా నేరుగా సీఎఫ్‌ఎంఎస్‌కు మళ్లిస్తున్నట్టు సమాచారం. రాష్ట్ర ఖజానాకు చేరిన ఆదాయాన్ని అమరావతి కాంట్రాక్టు పనులకు మళ్లిస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి. ఫలితంగా జీవీఎంసీ ఖజానా ఖాళీ అయిపోవడంతో కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులో సమస్యలు వస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం :

క్కడైనా కార్మికులు టూల్‌ డౌన్‌ చేయడం చూసి ఉంటాం.. కానీ రాష్ట్రంలో అతిపెద్ద గ్రేటర్‌ విశాఖ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ)లో ఏకంగా కాంట్రాక్టర్లు టూల్‌ డౌన్‌ చేస్తామని ప్రకటించారు. గత 13 నెలలుగా చేసిన పనులకు ఒక్క పైసా బిల్లు చెల్లించకపోవడంతో డిసెంబర్‌ 1వ తేదీ నుంచి టూల్‌ డౌన్‌ చేస్తామంటూ అల్టిమేటం జారీచేశారు. ఇప్పటివరకు చేసిన పనులకు సంబంధించి రికార్డుల్లో నమోదైనవే రూ.460 కోట్ల మేర బకాయిలు ఉండగా.. ఇప్పటికే పనులు పూర్తయి ఇంకా రికార్డుల్లోకి ఎక్కకుండా మరో రూ.300 కోట్ల మేర బకాయిలు ఉంటాయని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. బిల్లులు రాకపోవడంతో చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోయి.. లాభాల మాట దేవుడెరుగు నష్టాల్లోకి కూరుకుపోతున్నామని వాపోతున్నారు. సమ్మిట్‌, యోగా డేల పేరుతో ఇక్కడి కాంట్రాక్టర్లతో పనులు చేయించుకున్న ప్రభుత్వం ఒక్కపైసా విడుదల చేయడం లేదు. ఫలితంగా ఈ అదనపు భారం జీవీఎంసీ ఖజానాపై పడింది. ఫలితంగా చెల్లించాల్సిన బిల్లులు మరింతగా పెరిగిపోతున్నాయని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరులోగా బిల్లులు చెల్లించకపోతే డిసెంబర్‌ 1 నుంచి టూల్‌ డౌన్‌ చేస్తామని జీవీఎంసీ కాంట్రాక్టర్ల సంఘం స్పష్టంగా ప్రకటించింది. అయితే గత పదేళ్లలో జీవీఎంసీలో కాంట్రాక్టర్ల టూల్‌ డౌన్‌ చేపట్టలేదు.

మొక్కల బిల్లులకూముచ్చెమటలు పట్టించి..!

నెల రోజుల క్రితం హడావుడిగా ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు జీవీఎంసీ ఖజానా నుంచి రూ.5 లక్షలలోపు పెండింగ్‌లో ఉన్న బిల్లులను చెల్లింపులు చేశారు. కేవలం సీఐఐ సమ్మిట్‌కు మొక్కలను తెచ్చేందుకే ఈ బిల్లుల చెల్లింపుల చేసినట్లు తెలుస్తోంది. సీఐఐ సదస్సుకు ముందుగా హార్టికల్చర్‌ నుంచి మొక్కలు తెప్పించుకునేందుకు కాంట్రాక్టర్లను పిలిచారు. అయితే మొక్కల కోసం ముందుగా నగదు చెల్లించాల్సి ఉంటుందని.. బిల్లులు ఇస్తే తప్ప తేలేమని తేల్చిచెప్పారు. దీంతో అప్పటికప్పుడు కేవలం మొక్కలను సరఫరా చేసే కాంట్రాక్టర్లకు మాత్రమే.. అది కూడా రూ.5 లక్షలలోపు బిల్లులను క్లియర్‌ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఎంపిక చేసిన ఇతర కాంట్రాక్టర్లకు కూడా పర్సంటేజీలు ఇస్తే బిల్లులను మంజూరు చేశారనే ఆరోపణలూ ఉన్నాయి. ఇందులో అధికార పార్టీకి చెందిన నేతలకు పర్సంటేజీలు అందినట్లు తెలుస్తోంది. జీవీఎంసీలోని కీలక వ్యక్తి అనధికార పీఏ ‘రాజు’ చేతివాటంతో కూడా కొద్ది మందికి బిల్లులను చెల్లిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గతంలో 4–5 నెలల్లోనే బిల్లులన్నీ క్లియర్‌!

వాస్తవానికి గత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వ హయాంలోనూ విశాఖ కేంద్రంగానే పెట్టుబడుల సదస్సుతో పాటు జీ–20 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో భారీగా అభివృద్ధి పనులను చేపట్టారు. రూ.100 కోట్లకుపైగా విలువైన పనులు జరిగాయి. అప్పట్లో చేపట్టిన మోడల్‌ బస్‌ షెల్టర్లతో పాటు జంక్షన్ల అభివృద్ధి పనులు, వైఎస్సార్‌ వ్యూ పాయింట్‌ వద్ద చేపట్టిన మోడల్‌ ఆర్ట్‌తో పాటు బీచ్‌రోడ్‌ వెంట లైటింగ్‌ వంటివన్నీ నగరవాసులను ఆకట్టుకున్నాయి. అయినా బిల్లుల చెల్లింపులో ఎక్కడా ఇబ్బందులు ఎదురుకాలేదు. అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో కాంట్రాక్టర్లకు 4–5 నెలలకు మించి బిల్లులు పెండింగ్‌లో ఉంచిన దాఖలాలు లేవు. మెజార్టీ సందర్భాల్లో 3 నెలల్లోగానే బిల్లులను చెల్లించేవారు. ప్రత్యేకంగా జీవీఎంసీకి వచ్చే ఆదాయ వనరులను రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు మళ్లించలేదు. ఇక్కడ వచ్చిన ఆదాయాన్ని (ప్రాపర్టీ ట్యాక్స్‌, వీఎల్‌టీ వగైరా) ఇక్కడే ఖర్చు చేసేవిధంగా చూడటంతో పాటు వివిధ కార్యక్రమాల నిర్వహణ కోసం అదనంగా నిధులను మంజూరు చేయడంతో కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో ఇబ్బంది ఉండేది కాదు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి కాంట్రాక్టర్లకు ఎదురవుతోంది. గత 13 నెలలుగా ఒక్క పైసా కూడా రాకపోవడంతో కాంట్రాక్టర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.

కాంట్రాక్టర్ల కన్నెర్ర1
1/1

కాంట్రాక్టర్ల కన్నెర్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement